SPB : గాన గాంధర్వ (Gaana Gandharva)

My early memory of Sripathi Panditaradhyula Balasubrahmanyam, or as fondly called as SPB, is noting him as a judge for a renowned singing competition show, “Paaduta Teeyaga”.

It was a shocker for me when I was told that it was not NTR, ANR, Chirajeevi, Venky, Rajini etc. voicing their tunes in their respective movies, but it was SPB all along. I felt cheated. How is it even possible, one person mimicking so many voices?

Unless I change my language, I’m pretty sure I cannot express my views better. So, Telugu it is …

ఓలమ్మీ తిక్క రేగిందా అని ఎన్టీఆర్ అల్లరి చేసినా
ఎరక్క వచ్చాను ఇరుక్కు పోయాను అని ANR అన్నా
అబ్బనీ తియ్యని దెబ్బా అని చిరు పాడినా .

నాకు వారే కనపడ్డారు తప్ప ఆ గానం వెనుకన ఒక గాన గంధర్వుడు ఉన్నాడు అని, అతను నాయకుడి నడవడికకు తగ్గట్లు గళం మార్చి పాడగలడు అని తెలియనేలేదు. చిన్నతనం కదా !

శంకరా నాదశరీరా పరా అన్నా
అదివో అల్లదివో, అంతర్యామీ అని అన్నమయ్య కృతులు కీర్తించినా
భక్తి పారవశ్యం లో మునిగిపోయాము

తరలిరాద తనే వసంతం అన్నా
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ అని పాడితే
ఆలోచనలో ఉండిపోయాము

జననీ జన్మభూమిశ్చ అన్నా
పుణ్య భూమి నా దేశం అని పాడితే దేశ భక్తి తో ఒళ్ళు గగుర్పొడిచిపోయింది

ఇప్పటికి కూడా, ఎపుడు ఎక్కడ “పుణ్య భూమి నా దేశం” అనే పాటవినపడినా మరుక్షణం గొంతు కలిపేసి పాడేస్తాను. నేనే కాదు ఆ పాటకు ఏ తెలుగు వాడు అయినా గొంతు కలపవలసిందే, లేదంటే వారు అబద్ధం చెపుతున్నట్లే.

ఇలా చెప్పుకుంటూ వెళితే వేల కొద్దీ పాటలు. చెప్పటానికి నా వయసు, అనుభవం సరిపోవేమో ?

తెలుగు భాష లో కొన్ని పదాలు ఉన్నాయి అని మీ దగ్గరే నేను నేర్చుకున్నాను
మాతృ భాష మీద మీకు ఉన్న మక్కువ మీ యొక్క “పాడుతా తీయగా” చూసే ఎవరికైనా తెలుస్తుందేమో !

పాటలే కాదు, మీరు మాట్లాడినా అందులో ఏదో ఒక గొప్ప విషయం, తియ్యదనం ఉంటుంది అని ఏమో, తెలియని వయసులోనే గ్రహించి సమయం తప్పకుండా పొరుగు ఇంట్లో “పాడుతా తీయగా” ప్రతి వారం చూసేవాడిని.

“ప్రేమా ప్రేమా ” (ప్రేమ దేశం) అంటూ మీరు ఆలపించిన విరహ గేయం నాకు నిన్ననే వచ్చినట్లు ఉంది.
ఇంక ఇప్పుడే వచ్చిన “నువ్వు నాతో ఏమంటావో ” (డిస్కో రాజా) గురించి అయితే యేమని చెప్పను ?

ఒక సంగీత ప్రియునిగా మీరు ఎపుడెపుడు ఇంకొక తెలుగు సినీ గేయం ఆలపిస్తారో అని ఎదురు చూస్తూ ఉండేవాడిని.
ఇపుడు ఇక మీ గొంతు వినలేము, కొత్త పాటలు ఉండవు అని ఒక వైపు బాధ వేసినా, మీరు లేకపోయినా మాకోసం మీరు విడిచి వెళ్లినా మీ వేల కొద్దీ పాటల సమాహారం మిమ్మల్ని అమరం చేసేస్తాయి.

సంగీతం, సాహిత్యం, శృతి, లయ, పాట, సినిమా ఉన్న అన్ని రోజులు మీరు మాకు విడిచి వెళ్ళిన పాటల ఆస్తితో అలరిస్తూ మా మధ్యలో నే ఉంటారు. అందుకే మీకు వీడ్కోలు చెప్పదల్చుకోవటం లేదు.

… and begins playing “Okkdai Raavadam” from the film “Aa Naluguru” 😦

Even you, my reader, may have your thoughts after reading this. Feel free to express your views in the comment section.

SPB

Leave a comment